విజయవాడ: రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు ఆపాలని కోరుతూ... ఏపీ సీఎం జగన్‌కు సిపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండల కేంద్రం
నుండి మహానంది మండలం గాజులపల్లి వరకు చేపట్టిన యురేనియం తవ్వకాలను వెంటనే ఆపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా తవ్వకాలు జరుగుతున్నాయా? అని నిలదీశారు. యురేనియం తవ్వకాలు ప్రమాదకరమని ఓ పక్క ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతుంటే తవ్వకాలు జరపడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం యురేనియం తవ్వకాలు చేయబోమని శాసనసభలో తీర్మానం చేసిన విషయాన్ని రామకృష్ణ గుర్తుచేశారు. ఏపీలో కూడా అదే విధంగా యురేనియం తవ్వకాలను ఆపేయాలాలని డిమాండ్ చేశారు. ఈనెల 29న యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విజయవాడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.