కడప: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు బనగానపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ
ఎమ్మెల్యే కాటసారి రామిరెడ్డి ఇంటికి వెళ్లి సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్ పై స్పందించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటుకు పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాలకు పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.