Print
Hits: 968

అమరావతి: పురపాలక శాఖపై సీఎం జగన్‌ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నగరాలు, పురపాలక సంస్థల్లో మౌలికసదుపాయాల కల్పనపై

సీఎం అధికారులతో చర్చించారు. కాగా... ఈ సమీక్షకు మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ప్రతి మున్సిపాల్టీలో భూగర్భడ్రైనేజీ వ్యవస్థ ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే... మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ఉండాలన్నారు. ప్రతి ఇంటికి రేషన్‌ కార్డు, పింఛను, ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని ఆదేశించారు.

అదేవిధంగా... కృష్ణా నది కరకట్టపైనా, కరకట్ట లోపల ఉన్న ఇళ్లను కూల్చివేయాలని సీఎం ఆదేశించారు. కరకట్ట ప్రాంతంలో ఉన్నవారికి వారు కోరుకున్న చోట కనీసం 2 సెంట్లలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని కూడా అధికారులకు సూచించారు. వారికి ఉగాది నాటికి పట్టాలిచ్చి, మంచి డిజైన్లతో ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలంగా ఉంటున్న వారికి పట్టాలివ్వాలని సీఎం పేర్కొన్నారు. మరోవిప్పు తాడేపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

e-max.it: your social media marketing partner