Print
Hits: 906

పశ్చిమ గోదావరి: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనీ చూస్తోందని విమర్శలుగుప్పించారు టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప. ఈ రోజు ఆయన

మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాన్ని అణగదొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందుకే గట్టిగా మాట్లాడే తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అందులోభాగంగానే చింతమనేనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడని అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మరోవైపు రివర్స్ టెండరు పేరుతో ప్రభుత్వం, వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని చినరాజప్ప నిప్పులు చెరిగారు.

e-max.it: your social media marketing partner