విశాఖపట్నం: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పోలీస్ కేసు నమోదైంది. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా
అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపై ఐపీసీ 153ఏ, 500, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే... ప్రభుత్వం కావాలనే అబద్దపు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.