Print
Hits: 934

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఈ రోజు కేంద్రమంత్రి మాండవీయతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీకి రావాల్సిన నిధులు, ఆర్ధిక సహాయం,

రాష్ట్ర విభజన హామీలపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందచేశారు. అనంతరం గౌతమ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దుగరాజపట్నం పోర్టును జాతీయ పోర్టుగా ఏర్పాటు చేయాల్సిందని.. కానీ కొన్ని కారణాల వల్ల అమలుకాకపోవడంతో, ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలను చూపించాలని కేంద్రం కోరిందని చెప్పారు. అందుకోసం రామాయపట్నం, మచిలీపట్నం వంటి పోర్టులతో ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. అలాగే... బకింగ్‌హామ్ కెనాల్‌లో జల రవాణాపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు కూడా మంత్రి గౌతమ్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

e-max.it: your social media marketing partner