Print
Hits: 889

గుంటూరు: రాష్ట్రానికి కేంద్రం పదే పదే అన్యాయం చేస్తోన్న అధికార, ప్రతిపక్ష నేతలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు సీపీఐ నేత రామకృష్ణ. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...

రాష్ట్రానికి రైల్వే జోన్‌ను గాలికొదిలేశారని, రాజధాని నిధులపై కూడా వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు అడిగినా నిధులు ఇవ్వలేదని, ప్రస్తుత సీఎం జగన్ కి అడిగే పరిస్థితే లేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై మాట్లాడేవారు లేరనేదే కేంద్రం ధీమా అని రామకృష్ణ చెప్పుకొచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా నిద్రపోతున్నారా?.. జీవీఎల్‌కు నోరు పడిపోయిందా? రాష్ట్ర విభజన సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదు అని రామకృష్ణ నిలదీశారు.

e-max.it: your social media marketing partner