Print
Hits: 939

హైదరాబాద్: ఈ రోజు నుంచి ఏపీలో పరిమిత మద్యం అమల్లోకి రానుంది. ఏపీలో ఒక వ్యక్తి తన వద్ద ఎంత మద్యం కలిగి ఉండాలనేదానిపై పరిమితి విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే నూతన ఎక్సైజ్ చట్టం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ రోజు నుంచి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ 3 సీసాలు, ఫారిన్ లిక్కర్ 3 సీసాలు, మిథైలేట్ స్పిరిట్ 3 బల్క్‌లీటర్లు, బీర్ 6 సీసాలు (650 మి.లీ.), కల్లు 2 బల్క్‌లీటర్లను ఒక వ్యక్తి ఎలాంటి అనుమతి అవసరం లేకుండా కలిగి ఉండవచ్చని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డీ సాంబశివరావు ఉత్తర్వులు వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించి, అంతకుమించిన మద్యం కలిగిఉంటే శిక్షార్హులవుతారని ఆయన హెచ్చరించారు.

e-max.it: your social media marketing partner