Print
Hits: 880
chandrababu fire on sand shortage

రాష్ట్రంలో పెరిగిన ఇసుక రేట్లు, ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 'టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇసుక రేటెంత? వైసీపీ వచ్చాక

రేటు ఎంతకు పెరిగింది? నాలుగు నెలల్లోనే ఇసుక రేటు నాలుగైదు రెట్లు ఎలా పెరిగింది? పెరిగిన ఇసుక రేటు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? అంటూ  చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లేక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. 20లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్రజలకు సరఫరా చేసేందుకు వరదలు అడ్డొస్తే... మరి అనంతపురం మీదుగా కర్ణాటక తరలిపోతున్న ఇసుక ఎక్కడిది? జగ్గయ్యపేట మీదుగా తెలంగాణకు తరలిపోతున్న ఇసుక ఎవరిది? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.

e-max.it: your social media marketing partner