Print
Hits: 858
polavaram reverse tendering

గుంటూరు: పోలవరం రివర్స్‌ టెండరింగ్‌తో రాష్ట్రానికి సుమారు రూ.780 కోట్లు మిగిలిందన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ఏపీలోని

పలు ప్రాజెక్టులపై రివర్స్‌ టెండరింగ్‌ ఉత్తమ ఫలితాలనిస్తోందన్నారు. ఈ రోజు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... పోలవరానికి సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టారీతిన టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్సార్‌ మానస పుత్రిక అయిన పోలవరాన్ని గడువులోగా పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. వరదల కారణంగా ప్రాజెక్టు పనులకు అంతరాయం కలిగిందని, నవంబర్ నుంచి పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. డిజైన్ ప్రకారమే నిర్మాణం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకంగా జరుపుతోన్న టెండరింగ్ పై ప్రశంసించడంపోయి ప్రతిపక్ష పార్టీల నేతలు అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే...  దోచుకున్నదంతా బయటపడుతుందనే భయంతో టీడీపీ నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. 12.6 శాతం తక్కువతో పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొస్తే.. దానిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

e-max.it: your social media marketing partner