Print
Hits: 853

విజయవాడ: ఏపీ ఎంపీలతో దక్షిణమధ్య రైల్వే జీఎం గజనాన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయవాడ డివిజన్ విస్తరణ, కొత్త రైళ్లు, కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, అమరావతి

రైల్వే లైన్, దక్షిణ కోస్తా జోన్ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. కాగా... ఈ సమావేశానికి 17 మంది ఎంపీలు హాజరైనట్టు సమాచారం. అయితే... రైల్వే జీఎంతో సమావేశం మధ్యలో నుంచే బయటకు వచ్చిన టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ... కేంద్రంపై నిప్పులు చెరిగారు. విశాఖ రైల్వేజోన్ పరిధిని తగ్గించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది తూతూమత్రంగా సమావేశం నిర్వహిస్తున్నారని, గతంలోనూ రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు కొత్త రైళ్లు, కొత్త లైన్లు అడిగినా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సమన్వయంతో పనిచేసి... మన ప్రాజెక్టులు ముందుకు సాగేలా చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

e-max.it: your social media marketing partner