Print
Hits: 850

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, తన మిత్రుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ మరణ వార్త చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. గుంటూరులోని

టీడీపీ కార్యాలయంలో శివప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం శివప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని చంద్రబాబు భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ తో తనకున్న ఆత్మీయ బంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తాను, శివప్రసాద్ హైస్కూల్ విద్యను ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నామని, శివప్రసాద్‌ను తానే రాజకీయాల్లోకి ఆహ్వానించానన్నారు. శివప్రసాద్‌ టీడీపీకి చేసిన సేవలు మరువలేనివని, ప్రజా సమస్యలపై శివప్రసాద్ తిరుగులేని పోరాటం చేశారని కొనియాడారు. శివప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తామని చంద్రబాబు నివాళులర్పించారు.

e-max.it: your social media marketing partner