Print
Hits: 853

తూర్పు గోదావరి : దివంగత టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు అంతిమ యాత్రలో మీ నటన చూశానంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఓ వైపు కోడెల అంతిమయాత్ర జరుగుతుంటే మీరు ప్రజల్లో సానుభూతి కోసం నటించడం ఎందుకు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు వైఖరిపై ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోడెల అంతిమయాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేయాలి. లేదా మౌనంగా ఉండాలి. కానీ విజయానికి గుర్తులుగా రెండు వేళ్లు చూపడం మీ సంస్కారమా? ఈ నటన అంతా రాజకీయ లబ్ధికోసం కాదా? అని బాబును ముద్రగడ వరుస ప్రశ్నలు సంధించారు. కిర్లంపూడిని పాకిస్థాన్‌గా, తనను ఉగ్రవాదిగా, తమ జాతిని ఉగ్రవాదులుగా ముద్ర వేసింది మీరు కాదా? ఈ రోజేమో కేసుల చిట్టా చెప్తున్నారు. మరి మీ పాలనలో కాపు జాతి మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? రాక్షస పాలనతో ఏపీని భ్రష్టు పట్టించి, మనుషులను హీనంగా చూసి అవమానించింది మీరు కాదా? అంటూ మరో ప్రశ్న సంధించారు. ఇంతటి దారుణమైన చరిత్ర పెట్టుకుని రాష్ట్రం కోసమే బతుకుతున్నానని దొంగ మాటలు చెబుతూ ఇంకా ఎంతకాలం కన్నీరు కారుస్తూ నటిస్తారో మీరే చెప్పాలని చంద్రబాబును ముద్రగడ పద్మనాభం నిలదీశారు.

e-max.it: your social media marketing partner