Print
Hits: 831

తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ... వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో అంబటి

ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం ఆత్మహత్య కాదు, హత్య అని ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కోడెల మరణం వైసీపీ వారి వల్ల జరిగిందని చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని అంబటి హెచ్చరించారు. కోడెల 16వ తేదీన మరణిస్తే.. నిన్నటి వరకు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక మనిషి చనిపోతే భావోద్వేగం వస్తది. కానీ చంద్రబాబులో ఆ బాధ ఎక్కడా కనిపించడంలేదన్నారు.

చంద్రబాబులో కోడెల శవాన్ని నాలుగు రోజుల పాటు అడ్డు పెట్టుకుని రాజకీయంగా ఎంత మైలేజ్ తెచ్చుకోవాలనే తాపత్రయం కనిపించింది తప్ప ఎక్కడ కూడా ఆవేదన కనిపించలేదని అంబటి విమర్శించారు. కోడెల అసెంబ్లీలోని కోట్ల రూపాయాల విలువ చేసే ఫర్నిచర్‌ ఎత్తుకుపోతే... ఇప్పుడు చంద్రబాబు లక్ష రూపాయాల ఫర్నిచర్ అంటున్నారని ఆరోపించారు. అలాగే... సచివాలయ ఉద్యోగాల పరీక్ష పత్రాలు లీక్ అయిందనడంలో నిజం లేదని కొట్టి పడేశారు. ఒక వేళ పరీక్ష పత్రం లీకైతే అదే రోజు వార్త రావాలి. కానీ ఫలితాలు విడుదలైన రోజు వార్త రావడం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురద జల్లటానికే చంద్రబాబు పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

e-max.it: your social media marketing partner