Print
Hits: 1015
sekar reddy into ttd

వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టీటీడీ బోర్డు సభ్యులలో తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి పేరు రాజకీయంగా కలకలం రేపుతోంది. గతంలో చంద్రబాబు హయాంలో టీటీడీ

బోర్డు మెంబర్ గ ఉన్న ఆయన వద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా కొత్త నోట్లు బయటపడడంతో అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి సీఎం వైఎస్ జగన్ ఆయన చంద్రబాబు బినామీ అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. అంతేకాదు నోట్లను రద్దు సమయంలో ప్రజలంతా కొత్త నోట్ల కోసం ఏటీఎంల ముందు రాత్రి, పగలు పడిగాపులు పడుతున్న సమయంలో, ఇదే శేఖర్ రెడ్డి ఇంట్లో.. కోట్లకు కోట్ల కొత్త నగదు పట్టుబడింది. అంతేకాకుండా 2016 డిసెంబర్ 8 న శేఖర్ రెడ్డికి సంబంధించిన వ్యాపారసంస్థలు, నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.33.89 కోట్ల కొత్త 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వార్త పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి.

మరోవైపు అప్పటి వైసీపీ అధికార ప్రతినిధి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాయుడు కూడా శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ పత్రిక ప్రకటన చేశారు. అంతే కాకుండా అప్పటి మంత్రి నారా లోకేష్ శేఖర్ రెడ్డి వద్ద నుంచి రూ.100 కోట్లు తీసుకుని సిఫార్సు చేశారని కూడా అంబటి ఆరోపించారు.

అయితే గతంలో ఇన్ని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించడంతో శేఖర్ రెడ్డి వెనక ఉన్నది చంద్రబాబు, లోకేష్ లు కాదని సీఎం జగనే అని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.

e-max.it: your social media marketing partner