Print
Hits: 887
cm jagan review meeting

అమరావతి: రాష్ట్రంలో మూడు మేజర్‌ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు సీఎం జగన్. అందులో భాగంగా మచిలీపట్నం పోర్టును మేజర్‌ పోర్టుగా

తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఆయన పశుసంవర్థక, మత్స్యశాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణాలపై అధికారులతో చర్చించారు. భీమిలి సమీపంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపైనా చర్చించారు. ఈ క్రమంలో దాదాపు 12 జెట్టీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కాగా... సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, మత్సశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

e-max.it: your social media marketing partner