తిరుమల: సెప్టెంబర్ 13 నుంచి 22 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని
టీటీడీ పాలక మండలి పేర్కొంది. ఈ బ్రహ్మోత్సవాలకి సెప్టెంబర్ 13న రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు శ్రీ వారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. ఇక ఆగస్టు 31లోపు ఇంజనీరింగ్ పనులును పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల పనుల కోసం అదనంగా 700 మందిని టీటీడీ నియమించింది. గరుడ సేవ రోజు భద్రతా దృష్ట్యా 4 వేల మంది పోలీసులను నియమించింది. ప్రయాణికుల సౌకర్యార్ధం ఘాట్ రోడ్డులో 6,500 ట్రిప్పులు నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. రాత్రి 7 గంటలకు శ్రీవారి గరుడసేవ, రాత్రి 8 గంటలకు వాహన సేవలు ప్రారంభమవుతాయని టీటీడీ పేర్కొంది.