శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణంలో శ్రీవారు పద్మావతి మరియు ఆండాళ్ అమ్మవార్ల మెడలో మాంగళ్య సూత్రధారణతో పరిణయమాడిన ఘట్టాన్ని చూసిన భక్తజన౦ మురిసిపోయారు.

చిన్న వె౦కన్నస్వామి వార్ల కళ్యాణ వేడుకలను వీక్షించి పరమానందాన్ని పొ౦దారు. వైశాఖ మాస తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీవారి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ తూర్పు వైపున ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి వివిధరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ముఖద్వార మండపంలో స్వామి అమ్మవార్లను వేరు వేరు వాహనాల పై అలంకరించి ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు తీసుకొని వచ్చారు. ఈ మండపంలో వేంచేసియున్న స్వామి వారు మరియు అమ్మవార్ల కల్యాణమూర్తులకు దేవాదాయ శాఖ కమీషనరు శ్రీమతి అనురాధ, ఆలయ చైర్మన్ సుధాకరరావు, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదగా శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు అలంకరించి మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ కళ్యాణ వేడుకలు వైభవోపేతంగా జరిపించారు.

వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ సమయంలో జిలకర్ర, బెల్లం వంటి కార్యక్రమాలు వైశాఖమాస తిరు కళ్యాణం జరిపించారు. యజ్ఞోపవీతధారణ తలంబ్రాలు, బ్రహ్మ గ్రంధి ఆశీర్వచనము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదన చేసిన నీరాజనం మంత్రపుష్పం సమర్పించారు. విద్యార్థులు ప్రముఖులు భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...