తూర్పుగోదావరి జిల్లా కొత్తూరులో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీతలుపులు అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఫుష్పశోభితంగా అలంకరించిన అమ్మవారిని భక్తులు కుటుంబసమేతంగా దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. జాతరలో కోలాటాలు, శివపార్వతులు, ఆఘోరా వేషదారణలతో చేసిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.