తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాద్రిగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లలమామిడాడ గ్రామంలో వేంచేసిన శ్రీ కోదండరామచంద్రమూర్తి ఆలయంలో ఐదురోజులపాటు జరిగే శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తిచేశారు. కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులు నూతన పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించనున్నారు.