తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అయిన ఇవాళా స్వామివారు రథోత్సవం ఘనంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేతుడై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భజనలు, కోలాటాల మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.