తిరుమల శ్రీవారికి తోబుట్టువుగా పిలువబడే తిరుపతి తాతయ్యగుంట అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఈ వేడుకలో భాగంగా అమ్మవారికి శాస్ర్తోక్తంగా అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి మొక్కుగా వేసే అనేక వేషధారణలో మొదటిది అయిన భైరగి వేషంతో ఇవాళా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గంగమ్మ జాతరకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దిని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఛైర్మన్ తెలిపారు.