టీటీడీ పాలకమండలికి కొత్త చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్ నియామకం పట్ల ఓ వైపు వివాదాలు సాగుతుండగానే ప్రమాణస్వీకారం కార్యక్రమం ముగిసిపోయింది.
ఆయన క్రిస్టియన్ అన్న ఆరోపణలు తీవ్రంగా వినిపించాయి. అయినా ఏపీ సర్కారు ఆయన పట్లే కరుణ చూపింది. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ 47వ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చైర్మన్ తోపాటు పాలకమండలి సభ్యులు బోండా ఉమా, చల్లా రామచంద్రారెడ్డి, మేడ రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, బీకే పార్థసారధి, రుద్రరాజు, రాయపాటి, డొక్కా జగన్నాథం, రమేష్ బాబు, శివాజీలతో ప్రమాణస్వీకారం చేయించారు. వీరితో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా మన్మోహన్ సింగ్, అనురాధ, అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణం చేశారు. టీటీడీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి హాజరయ్యారు.