తిరుమల శ్రీవారి సన్నిధి భక్తులతో పోటెత్తుతోంది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలకు భారీగా తరలివస్తున్నారు భక్తులు.

దీనికి తోడు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు దాదాపు 18 నుండి 20 గంటల  దాకా వేచిఉండల్సి వస్తోంది. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తులకు కూడా సుమారుగా 5 ఉంచి 6 గంటల సమయం పడుతున్నది..రద్దీ పెరగడంతో వసతి గదులు సైతం దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..ఇక కాలినడకన తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు స్లాట్ విధానంలో కేటాయిస్తున్న టోకెన్లు కూడా మధ్యాహ్నం కే అయిపోతున్నాయి. కంపార్ట్  మెంట్లు, క్యూలైన్లలో  వేచి ఉండే భక్తులకు పాలు , కాఫీ , సాంబారన్నం, ఉప్మా, కిచిడి తదితర అల్పాహారం అందిస్తున్నారు టీటీడీ సిబ్బంది. తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట దగ్గర ,అదనపు లడ్డూ టోకెన్ కౌంటర్ల దగ్గర గంటల తరబడి భక్తులు నిరీక్షించాల్సి వస్తోంది. 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...