తెలంగాణలో ప్రసిద్దిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్నహనుమాన్‌ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు చైత్ర శుద్ద పౌర్ణమి రోజు వచ్చే హనుమాన్‌ జయంతితో ఉత్సవాలు ముగియనున్నాయి.

దీక్షా చేపట్టిన హనుమాన్‌ మాలధారులు స్వామి వారి సన్నిధికి ఇరుముడితో చేరుకుని దీక్షా విరమణ చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన దీక్షాపరుల రామనామస్మరణతో మారుమ్రోగుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచే కొండపైకి దీక్షా పరులు చేరుకున్నారు. అర్థరాత్రి ఈ తాకిడి మరింత పెరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో దీక్షాపరులు ఆలయానికి చేరుకున్నారు. పోలీసులు అయిదు వందల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. భక్తులను కొండపైకి చేరుకునే అయిదు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఆలయంలో మంచినీరు, చలవ పందిళ్లు వైద్యసాయం, వసతి కోసం చలవ పందిళ్లను ఏర్పాటు చేశారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...