తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నెల 18న తెలుగు సంవత్సరాది శ్రీ విళంబినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఈ కార్యక్రమం చేపట్టింది.
ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ అళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ ఆలయశుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. ఉదయం ఆరు గంటలకు మొదలైన తిరుమంజనం సుమారు ఐదుగంటలపాటు కొనసాగుతుంది. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది అత్యంత పవిత్రంగా నిర్వహిస్తున్నారు.