ఎంతో వ్యయ ప్రయాసలతో తిరుమల చేరుకుని, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి, రెప్పపాటు కాలం పాటు వెంకటేశ్వరుని చూసి బయటకు వచ్చే భక్తులకు ఇప్పుడు మరింత స్పష్టంగా ప్రకాశవంతంగా స్వామివారు కనిపించనున్నారు. గర్భగుడిలోని నేతి దీపాల వెలుగుల కాంతిని పెంచాలని టీటీడీ నిర్ణయించింది.

వీటిల్లోని ఒత్తుల పరిమాణాన్ని పెంచి, ఉదయం సుప్రభాతసేవ సమయంలో ఆపై మధ్యాహ్నం 11 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు మరింత నెయ్యిని నింపించడం ద్వారా, స్వామిని మరింత స్పష్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం, గర్భగుడిలో విద్యత్ దీపాలను వెలిగించరాదన్న సంగతి తెలిసిందే. అందువల్లే అనాదిగా నేతిదీపాల వెలుగులోనే స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు ఏకాంగులు దీపకాంతిని తగ్గకుండా చూస్తుంటారు. వేలాడదీసిన రెండు దీపకుందీలతో పాటు కిందివైపు మరో రెండు కుందీల్లో వెలిగే దీపాల కాంతి నడుమే స్వామిని దర్శించుకోవాలి. వీటి వెలుగులను పెంచడంతో జయవిజయుల విగ్రహాల వద్దనుంచి కూడా స్వామి స్పష్టంగా కనిపిస్తున్నారని భక్తులు ఆనందాన్ని వక్తం చేశారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...