తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం జరిగింది. రథంపై వూరేగుతూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కర్పూర నీరాజనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అమ్మవారు అధిరోహించిన రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.