గలగల పారుతున్న సహజ సిద్దమైన జలధారలు సింహాచల క్షేత్రంలో కొలువై వున్నాయి. ఈ కొండ చుట్టూ 12 నీటి ధారలు నిత్యం ప్రవహిస్తూ వుంటాయి. పాపహరణం పవిత్ర గంగ స్నానం.. అంటారు. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు మంత్ర జపం చేస్తూ పవిత్ర గంగధారలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. నారసింహ స్వామి క్షేత్రంలో వున్న గంగధారనుండి ప్రవహించే నీటి ధారలు నారయణ మంత్రాన్ని జపిస్తున్నట్లు కనిపిస్తాయి. సింహాచలం గంగధారలో స్నానమాచరిస్తే అన్ని నదీ జలాల్లోను పుణ్య స్నానాలు చేసిన ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. ఆకాశ ధారగా పిలవబడుతున్న సింహాచలం గంగ ధార పై ఓం సమాచారం ప్రత్యేక కథనం.... క్రింద ఉన్న వీడియో ని చూడండి.
దేవుడు సృష్టించిన మనిషికే పచ్చని ప్రకృతి అంటే ఇంత మక్కువైతే చరాచర జగత్తును సృష్టి చేసిన ఆయనకు ఈ సృష్టిపై ఇంకెంత ఎక్కువ మక్కువ ఉండాలో చెప్పండి? కాబట్టే కొండలు, కోనలు, చెట్టులు, పుట్టలు, సొరంగాలు, నీటి తరంగాలు అన్నింటిని తన ఆవాసాలుగా చేసుకున్నాడు. ఇంతటి విశాలమైన, విస్తృతమైన ప్రదేశాలుండగా వాటినే ఎందుకు నివాసం ఉంటాడో ఊహించుకుంటే అందులోని అసలు ఆంతర్యం బోధపడుతుంది. నోరు ఎండిపోతున్న వాడికే నీరు, అన్నార్తితో అలమటిస్తున్న వాడికి అన్నం విలువ తెలుస్తుంది. అలాగే, ఆర్తిగా ఉన్న వాడికే దైవం తలపు కలుగుతుంది. తనను నిర్లక్ష్యం చేసే వారిని మరింత పరీక్ష పెట్టే వద్దకు రప్పించుకుని రక్షించేందుకే ఇలాంటి ప్రదేశాలను ఎన్నుకుని నెలకొని ఉంటాడా పరమాత్మ.
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...