Print
Hits: 5740

అనంతపురం జిల్లాలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. అనంతపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. కదిరిలోని లక్ష్మీనరసింహా స్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. హిందూపురంలోని చెన్నకేశస్వామి దేవాలయం, దర్మవరంలోని వేణుగోపాలస్వామి ఆలయం, తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారు జామున రెండు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు.

e-max.it: your social media marketing partner