అనంతపురం జిల్లాలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. అనంతపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. కదిరిలోని లక్ష్మీనరసింహా స్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. హిందూపురంలోని చెన్నకేశస్వామి దేవాలయం, దర్మవరంలోని వేణుగోపాలస్వామి ఆలయం, తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారు జామున రెండు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు బంగారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామి వారిని బంగారు రథంపై కొలువు దీర్చి వస్తున్న సమయంలో స్వర్ణకాంతుల మధ్య వాహన సేవను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తుల హాజరయ్యారు. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహాకా అనే నాలుగు గుర్రలను పూన్చిన స్వర్ణ రథంపై స్వామివారు విహరించారు. దారుకుడు రథసారథిగా వేలాది భక్తుల గోవిందనామస్మరణల మధ్య స్వర్ణరథం ముందుకు సాగింది.
https://www.youtube.com/watch?v=qDUSlG33wuU
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...