దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో శివకల్యాణం వైభవంగా జరిగింది స్వామివారికి నగరపంచాయతీ పాలకవర్గం పట్టువస్త్రాలను సమర్పించింది. ఈ కల్యాణం చూసేందుకు భక్తులు పొటెత్తారు. దీంతో ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేసి, మహాలఘుదర్శనం అమలు చేశారు.  

 

 

 

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరుణ్ కుమార్ మిశ్రా, ఎన్. వి రమణ తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో టిటిడి ఈఓ అనిల్ సింఘాల్ శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని న్యాయమూర్తులకు అందజేసి సత్కరించారు.

 

 

ఈ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఇటీవల తన కుమార్తె వివాహం జరిగిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. 

 

 

తిరుమల శ్రీవారిని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు త్వరలో విశాఖ సాగర తీరాన 'ప్రత్యేక హోదా ఉద్యమ కెరటం' పేరుతో కార్యక్రమం చేయనున్నట్లు ఆయన తెలిపారు.