నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం ఫార్మా డి డాక్టర్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్లినికల్ ఫార్మాసిస్టులుగా నియమించాలని కోరుతూ ఫార్మా డీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, డీ ఫార్మా చదివిన పేద విద్యార్దులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మాసిస్టులుగా నియమించాలని ఫార్మా విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో డీ ఫార్మా చదివామ.. కానీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.