మొటిమెలు రాకుండా ఏం చేయాలి... చాలా సింపుల్ అండీ టీకా వేయించుకోవడమే. అదేంటి మొటిమలకు టీకాలా అంటే అవును సైన్స్ అద్భుతాలను సాధ్యాలుగా మార్చుతోంది మరి. సాధారణంగా 11నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మొటిమెలతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. దీనిపై దృష్టిసారించిన చర్మ సౌందర్య నిపుణులు టీకాను అభివృద్ధిచేశారు. మరో రెండేళ్లలో ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈటీకా ప్రయోగాత్మకంగా తుది దశ పరిశోధనలో ఉంది. నిజానికి మొటిమలు రావడం ఆరోగ్యకరమైనదే అని పరిశోధనల్లో తేలినా వీటితో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేవారి సంఖ్య చాలా ఎక్కువ.