హైదరాబాద్: ఆగస్టు-15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నగర సీపీ అంజనీ కుమార్ యాదవ్ ఏర్పాట్లు, భద్రతపై ఉన్నతాధికారులతో ఈ రోజు
సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ... గోల్కొండ కోటలో జరగనున్న పంద్రాగస్టు వేడుకలకు వచ్చేవారు హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, టిఫిన్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జెండావందనం సందర్భంగా పరేడ్ జరిగే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కమిషనర్ తెలిపారు.