Print
Hits: 112
jagan chief guest for kaleshwaram project inauguration

కాళేశ్వరం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ ను ముఖ్యఅతిధిగా ఆహ్వానించాలని

కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా... ఈ ప్రాజెక్టును ఈనెల 21న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ను ఆహ్వానించేందుకు స్వయంగా కేసీఆర్ త్వరలోనే విజయవాడకు వెళ్లి ఆయనను ఆహ్వానించనున్నట్టు సమాచారం. అంతకుముందు జగన్ కూడా ఏపీ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా స్వయంగా ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించినా విషయం తెలిసిందే. జగన్ కోరిక మేరకు కేసీఆర్ విజయవాడ వెళ్లి జగన్ ను ఆశీర్వదించి వచ్చారు.

e-max.it: your social media marketing partner