Print
Hits: 111

హైద‌రాబాద్: నూత‌నంగా ఎన్నికైన నిర్మల్ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కే.విజ‌య‌ల‌క్ష్మి, వైస్ చైర్ ప‌ర్స‌న్ సాగ‌ర‌బాయి, ఆదిలాబాద్ జ‌డ్పీ చైర్మ‌న్ రాథోడ్ జ‌నార్ధ‌న్, వైస్ చైర్మ‌న్ ఆరె రాజ‌న్న

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో కలిసి వచ్చిన వారు ప్ర‌గతి భ‌వ‌న్ లో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంకా కేటీఆర్ ను కలిసిన వారిలో కో ఆప్ష‌న్ స‌భ్యులు సుభాష్ రావు, ర‌ఫీక్ ఆహ్మ‌ద్, ప‌లువురు జ‌డ్పీటీసీ స‌భ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ముందుగా నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను కేటీఆర్ అభినందించారు. అలాగే... బంగారు తెలంగాణ లక్ష్యంగా, సీఎం కేసీఆర్ సూచనల మేరకు గ్రామాల్లో పని చేయాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణాలో గ్రామా స్వరాజ్యాన్ని నిర్మించాలని వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, జోగు రామ‌న్న, డైరీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ లోక భూమా రెడ్డి, టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు శ్రీహ‌రి రావు, రాంకిష‌న్ రెడ్డి, త‌దితరులు పాల్గొన్నారు.

e-max.it: your social media marketing partner