తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులోని బస్టాండులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి పోయాయి. దసరా, దీపావళి సందర్భంలో ఉండేంత
రద్దీ ఈరోజు జేబీఎస్, ఎంజిబిఎస్, బస్టాండుల్లో అలాగే సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లో కనిపించింది. తమకు నచ్చిన అభ్యర్థిని ఓటేసి గెలిపించడానికి హైదరాబాదులో ఉంటున్న తెలంగాణ ఓటర్లు పయనమయ్యారు. రద్దీని గమనించిన తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం అప్పటికప్పుడు సమావేశమై రోజూ తిరిగే 3500 బస్సులకు అదనంగా మరో 1200 బస్సులు వేసినట్టు తెలిపింది. నగరంలోని సిటీ బస్సులను కూడా కరీంనగర్, వేములవాడ, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాదు, వరంగల్ బోర్డులు పెట్టి నడుపుతున్నామాని తెలిపింది. బస్సులు దొరక్క ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు... పండుగల సమయంలో స్పెషల్ బస్సులు వేసే ఆర్టీసీ ఐదేళ్ల కు ఒకసారి వచ్చే ఎన్నికలకు ముందస్తుగా బస్సులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ ప్రశ్నిస్తూ... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.