నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మరో రెండ్రోజుల్లో పోలింగ్ కూడా జరగనుంది. ఈ తరుణంలో పలు టీవీ ఛానళ్లు,

సఫాలజిస్టులు సర్వేలు చేసి, ఏ పార్టీకి అధికారాన్ని చేజిక్కించుకుంటుందో చెప్తున్నాయి. పోనీ అన్నీ సర్వేల్లో ఒకే రకమైన ఫలితాలు వస్తున్నాయా అంటే అదీ లేదు. ఒకరు చేసిన సర్వేలో టీఆర్ఎస్ గెలుస్తుందని అంటే, మరో సర్వేలో కూటమికే అధికారమంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ పార్టీ గెలుస్తుందో..ఏ పార్టీ ఓడుతుందో..ఏ సర్వే చెప్పేది నమ్మాలో అర్థంకాక ఆయా పార్టీలు సహా, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ సర్వేల తీరు చూసిన విశ్లేషకులు ఉగాది రోజున ప్రధాన పార్టీల కార్యాలయాలయాల్లో పంచాంగం చెప్పే పండితులు గుర్తొస్తున్నారంటూ నవ్వుకుంటున్నారు.

            ఎవరు సర్వే చేసినా అభిప్రాయాన్ని సేకరించేంది మాత్రం ఓటర్ల నుంచే అయినపుడు భిన్నమైన ఫలితాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తే..ఆయా సర్వేలు నిర్వహిస్తున్న ఛానళ్లు, సఫాలజిస్టుల నుంచి సమాధానం రావట్లేదు.  పార్టీలను ప్రలోభపెట్టి పబ్బం గడుపుకునే సర్వే ముఠాలు..ఎన్నికల సర్వే పేరుతో ప్రజల మైండ్ సెట్ ను మార్చేందుకు ఏమైనా జిమ్మిక్కులు..గిమ్మిక్కులు చేస్తున్నారేమోనన్న అనుమానాలు సైతం లేకపోలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ గాలి వీస్తోందని, 94 నుంచి 104 సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఓ ఛానల్ అంటే..కాదు కూటమే నిలబడుతుందని మరో ఛానల్ అంటుంది. ఈ సర్వేల ఫలితాలను చూస్తున్న ఓటర్లు బిత్తరపోతున్నారు.     

కానీ..ఎన్నికల సర్వేలు చేస్తున్న వాటిలో ఏ సంస్థ చరిత్ర చూసిన ఏదొక సందర్భంలో తప్పుడు ఫలితాలు వెల్లడించిన దాఖలాలు లేకపోలేదనే చెప్పాలి. లగడపాటి రాజగోపాల్ కు చెందిన సంస్ధ తమిళనాడు ఎన్నికల సందర్భంగా జయలలిత ఓటమి చవిచూస్తారని సర్వేలో పేర్కొంది. తీరా ఫలితాలను చూసే సరికి మొత్తం తారుమారై, జయలలిత మళ్లీ సీఎం అయ్యారు. ఇలా ఒకటి కాదు..సఫాలజిస్టులు సైతం ఓటర్ల అభిప్రాయాన్ని తెలపడంలో పూర్తిగా విఫలమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం. ప్రజలు ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వారికే ఓటు వేస్తారు కానీ ఈ సర్వేల పేరుతో మసి పూసి మారేడు కాయ చేయాలనే ప్రయత్నాలేవీ ఫలించవన్న విషయం చాలా సార్లు ఋజువైంది.

 ఈ సర్వేల వెనుకున్న ప్లాన్ మాత్రం ఒక్కటే..కొన్ని ఛానళ్లు జనం నాడికి తెలుసుకోలేక పోయినా తాము చేసిన సర్వేలో మీ పార్టీకే అనుకూల ఫలితాలొస్తాయని చెప్పి రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్లు వరకూ దండుకోవడం మాత్రం ఖాయం. అందుకే ఎన్నికలెప్పుడొస్తాయా ? ఏ పార్టీ నుంచి ఎంత దోచుకోవాలా..! అని ఆయా పార్టీలు గోతికాడ నక్కలా కాచుకుని ఉంటాయి. తీరా ఫలితాలు వెల్లడయ్యాక సర్వేల పేరుతో తాము ఎలా మోసపోయామో అభ్యర్థులకు అర్థమయినప్పటికీ..చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా..ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతారు. ఓ వైపు ఎన్నికల సంఘం నిబంధనల పేరుతో తప్పు చేసే వారిని కట్టడి చేస్తామని చెప్తున్నా..సర్వేల పేరుతో దోచుకునే వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం బలంగా వినిపిస్తోంది. మరి సర్వేల పేరు చెప్పి అభ్యర్థులను మభ్యపెట్టి, అందినకాడికి దోచుకునే వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుందో..లేదో...ఒక వేళ చర్యలు తీసుకుంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయన్నది తెలియాలంటే ఈసీ స్పందన కోసం వేచి చూడాల్సింది. 

e-max.it: your social media marketing partner

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

100 కాదు 10 స్టులు కూడా రావు పో...

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమన్నారు ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అసెంబ్లీని అర్ధాంతరంగా...

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

వైఎస్ హయాంలో వంశధార ఎలా పూర్తయింది ?

వంశధార నిర్మాణ పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే

రేపే కౌంటింగ్..ఏర్పాట్లు పూర్తి

ఈ నెల డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఆసిస్ గడ్డపై భారత్ తొలి టెస్ట్ విజయం

ఆస్ర్టేలియాపై భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించింది. కంగారూలపై భారత్ దాదాపు 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...