Print
Hits: 314

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు.

ఆయనపై ఐపీసీలోని 419, 490, 467, 468, 471, 370 సెక్షన్లతోపాటు పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో మంగళవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు డీసీపీ సుమతి. భార్య, పిల్లలంతా నకిలీ సర్టిఫికెట్లతో పాస్ పోర్టులు పొందారని చెప్పారు. 2004లో కుటుంబ సభ్యుల పేర్లతో పాస్ పోర్ట్ తీసుకున్నారని, డాక్యుమెంట్లలో ఫొటో మార్పిడి జరిగిందని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు తేలిందన్నారు. ముగ్గురిని అమెరికాకు తరలించారని, ఒక్కొక్కరి వద్ద 5 లక్షల రూపాయలు తీసుకున్నట్లు జగ్గారెడ్డి అంగీకరించారని సుమతి వివరించారు. అన్ని కేసులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు.

e-max.it: your social media marketing partner