t wallet mobile app

రవాణాశాఖలో పూర్తి స్థాయి ఐటీ సేవల వినియోగం

  •    కొత్తగా వరంగల్ - పూనా సర్వీస్
  •    రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు9 : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలను పూర్తి స్థాయిలో వినియోగిస్తుందని రవాణాశాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సచివాలయంలో టీఎస్ ఆర్టీసీ టీ- వ్యాలెట్ ను ఆయన ప్రిన్సపుల్ సెక్రటరీ, ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ, ఈడీ పురుషోత్తం నాయక్ లతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం టీ-వ్యాలెట్ కు అనుసంధానంగా టీఎస్ ఆర్టీసీను రూపకల్పన చేసిందని చెప్పారు. టీ-వ్యాలెట్ ఆవిష్కరణతో ఆర్టీసీలో విమానయాన ప్రయాణికుల తరహాలో ముందుగానే తమ సీట్లను ఇంటి వద్ద నుండే  రిజర్వ్ చేసుకునే సదుపాయాలు ఇక మీదట పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రోజు 13 వేల సీట్లు ఆన్ లైన్ సదుపాయాలకు అవకాశం ఉండగా రోజు 6 వేలు రిజర్వేషన్ అయ్యేవని ఇలా రూ.62 లక్షల ఆదాయం ఆర్టీసీకి వస్తుందని చెప్పారు. అయితే టీ-వ్యాలెట్ తో పూర్తి స్థాయిలో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని టీఎస్ ఆర్టీసీ కి చెందిన 900 అంతర్ రాష్ట్ర సర్వీసుల తాలూకు 1770  దూర ప్రాంతాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు.

     టీ- వ్యాలెట్ తో రిజర్వేషన్ కనీసం 30 రోజుల ముందే ఆన్ లైన్ లో చేసుకోవచ్చని ఇది ఎస్ఎంఎస్ ద్వారా నిర్ధారణ అవుతుందని వివరించారు. పొరుగు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, గోవా, ఏపీ లకు సర్వీసులు నడుపుతున్నామని వీటిలో ఏపీకి 700 సర్వీసులు నడుస్తుండగా త్వరలో మరో 100 సర్వీసులు పెంచుతామని వెల్లడించారు. వరంగల్, నిజామాబాద్ లకు నడుపుతున్న వజ్ర సర్వీస్ సేవలు బాగున్నాయని ఆన్ లైన్ సేవలను వీటికి మరింత ఉపయోగపడుతాయని చెప్పారు. త్వరలో వరంగల్ - పూనా అంతర్ రాష్ట్ర కొత్త సర్వీసును ప్రారంభిస్తామని ఏర్పాట్లు పూర్తైనాయని అన్నారు. తెలంగాణ రవాణా శాఖ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రూపొందించి సుమారు 20 లక్షల మందికి సౌకర్యంగా ఉన్న ఎం- వ్యాలెట్ తరహాలో ఆర్టీసీ టీ-వ్యాలెట్ పనితీరు ఉంటుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత పటిష్టపరుస్తామని అన్నారు. నష్టాలలో ఉన్నా ఆర్టీసీ పేదలకు సేవలు అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం సంస్థను సామాజిక కోణంలో ఆదుకుంటుందని అన్నారు. ఆర్టీసీ సేవలను మరింత విస్తరిస్తాయని చెప్పారు. ఈడీ పురుషోత్తం నాయక్, వోయడ్సీటు సుధాకర్ రెడ్డి, కృష్ణకాంత్ ఆర్టీసీ ఐటీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

e-max.it: your social media marketing partner

చంద్రబాబు ఓటమి 100 శాతం ఖాయం...

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఓటమి 100 శాతం ఖాయమైందని తేల్చి చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి...

మీ అబద్దపు హామీలను ప్రజలు నమ్మరు

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మభ్యపెడుతూ... రాహుల్‌ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేప...

నెల్లూరుకు చేరుకున్న రాష్ర్టపతి

నెల్లూరుకు చేరుకున్న రాష్ర్టపతి

రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం నెల్లూరు చేరుకున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్

తిరుపతిలో రాహుల్ పర్యటన నేడు

తిరుపతిలో రాహుల్ పర్యటన నేడు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని..సాయ...

అసెంబ్లీ సోమవారానికి వాయిదా...

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈరోజు శాసనసభలో జరిగిన సమావేశాల్లో ఓ...

ఎల్లంపల్లి రిజర్వాయర్ వద్ద టీడీపీ ఆందోళన

పెద్దపల్లి: ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఆ డ్యామ్ ముందు టీడీపీ...

కాశ్మీర్ లోయలో హై అలర్ట్

కాశ్మీర్ లోయలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో మరిన్ని ఉగ్రదాడులు జరిగేందుకు ఆస్కారం అందని ఇం...

జపాన్ లో భూకంపం

జపాన్ లో భూకంపం

జపాన్ దేశంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. జపాన్ కు ఉత్తరాన ఉన్న హొక్కైడో దీవుల్లో సంభవించిన...

సోపోర్ లో కాల్పులు..ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ లో మరోమారు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్...

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతీయండి... ఇజ్రాయిల్ సలహా

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడా రాజీవ్ గాంధీ నగర్ లో శుక్రవారం తెల్లవారుజామున డీసీపీ

జయరాం హత్యకేసులో తెరపైకి కొత్త వ్యక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత...

హైదరాబాద్: తెలుగు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఊపిరితిత...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దుస్తులు ధరించే పద్ధతి..షో ల గురించి మాట్లాడి...

ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దు...

ముంబై: 12వ సీజన్, ఐపీఎల్ -2019 ప్రారంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఈ వేడు...

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

లాభాల్లో స్టాక్స్

లాభాల్లో స్టాక్స్

సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు