కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లపై వేసిన అనర్హత వేటును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ పార్టీ స్వాగతించింది.

హైకోర్టు తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిందని వ్యాఖ్యానించింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అన్యాయంగా తమ సభ్యులపై వేటు వేశారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని, కేసీఆర్‌కు నైతికత ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ మంగళవారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే,

కేసీఆర్‌ నెలరోజులుగా మానసికంగా నన్ను ఇబ్బందులు పెట్టారు. నా అనుచరుడిని కూడా హత్య చేశారు.  న్యాయస్థానాలు నాకు రక్షణగా నిలిచాయి. కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. కేసీఆర్‌ డ్రామా ఆడి పైశాచిక ఆనందం పొందాడు. చేయని తప్పుకు నాతో పాటు దళిత శాసన సభ్యుడు సంపత్‌పై అనర్హత వేటు వేశారు. నా అనుచరుడిని హత్య చేసిన విషయం కాల్ డేటాలో పట్టుపడిన విషయం నిజం కాదా? పైన దేవుడు ఉన్నంతవరకు 100 మంది కేసీఆర్‌లు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. కేసీఆర్‌కు నైతికత ఉంటే రాజీనామా చేయాలి అంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. 

ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లపై విధించిన బహిష్కరణ వేటును  కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ఇది ఈ నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. అప్రజాస్వామిక చర్యలతో ప్రజలను, ప్రశ్నించే గొంతులను నులిమివేయాలని చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పతనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుంది. ప్రజల మద్దతుతో ముందుకు పోతుంది. ఎప్పటికైనా గెలుపు మాదే. అధికార దూరహంకారంతో, విచ్చలవిడి చేష్టలతో విర్రవీగిపోతున్న కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి అంటున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. 

హైకోర్టు తీర్పుతో టీఆర్‌ఎస్‌ సిగ్గుపడాలి. ప్రతిపక్షాలపై కక్షపూరితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది టీఆర్‌ఎస్‌ దిగజారుడు నిర్ణయం.  కేసీఆర్‌కు ఒక్కరోజు కూడా  సీఎంగా కొనసాగేహక్కు లేదు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గు రావటం లేదు. దేశం సిగ్గుపడేలా ప్రభుత్వం వ్యవహరించింది. సీఎం కేసీఆర్‌కు ఈ తీర్పు చెంపపెట్టు. సీఎం ఎన్నికలకు సిద్ధం అంటున్నారు. పార్టీ మారి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రాజీనామా చేయించాలి. ప్రభుత్వానికి దమ్ము ఉంటే శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్దాం. కోర్టు తీర్పును కూడా స్పీకర్ అమలు చేయకుంటే ప్రజలు అసలు తీర్పు ఇస్తారు. సీఎం కుర్చీకి నామినేషన్ ప్రక్రియ లేదు, ఉంటే కనుక 20 ఏండ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండేలా నామినేట్ చేసుకునే వాడు అంటున్న డీకే అరుణ

 

e-max.it: your social media marketing partner

కేసిఆర్ మూటా ముళ్ళు స‌ర్ధుకోవ‌టం ఖాయం

డిసెంబర్ 11న రానున్న తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మూటా ముళ్ళు స‌ర్ధుకోవ‌టం తప్పదని...

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

వైఎస్ హయాంలో వంశధార ఎలా పూర్తయింది ?

వంశధార నిర్మాణ పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

కూర్మావతారంలో భద్రాచలం రాముల వారు...

భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి అధ్యయనోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు రాముల వారు కూర్మావతారంలో దర్శనమ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ఢిల్లీ న‌జ‌ఫ్‌గ‌ర్ ఎన్‌కౌంట‌ర్‌ లో ముగ్గురు అరెస్ట్...

దేశ రాజధాని న్యూఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో రాష్ట్ర పోలీసులు ముగ్గురు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...