హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య రోజురోజుకు పెరిగిపోతోంది. కిలోమీట‌ర్ దూరం వెళ్ళాలంటే అర‌గంట స‌మ‌యం ప‌డుతోంది. ట్రాఫిక్ స‌మ‌స్యను త‌గ్గించేందుకు భారీ ప్రాజెక్ట్ ల‌ను నిర్మించేందుకు ఆస‌క్తి చూపిస్తున్న ప్రభుత్వం అంత‌ర్గత ర‌హ‌దార్ల నిర్మాణంపై ఏమాత్రం దృష్టి సారించ‌డం లేదు. ప్రధాన ర‌హ‌దార్ల మ‌ధ్యలో బ‌స్తీలు లేదా ప్రభుత్వ స్థలాల మీదుగా లింక్ రోడ్లను నిర్మిస్తే ఆయా ర‌హ‌దార్లలో ట్రాఫిక్ ను మ‌ళ్ళించి స‌మ‌స్యను అరిక‌ట్టవ‌చ్చు.

ఈ ర‌క‌మైన మార్గాల‌ను వాహ‌న‌దార్లే వెతుక్కుంటూ ఇరుకైన సందుల్లో త‌మ వాహ‌నాల‌ను పోనిస్తూ గ‌మ్య స్థానాల‌కు చేరుకుంటున్నారు. వాహ‌న‌దారుల కంటే ముందు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ యంత్రాంగం ఈ విష‌యంలో చొర‌వ చూపించి ప్రణాళిక‌లు సిద్దం చేయాల్సి ఉన్నప్పటికీ సంస్థలో సాగుతున్న గుత్తాధిప‌త్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ‌రికి వారు త‌మ‌కెందుకు అని త‌ప్పించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల‌లో కేవ‌లం అర కిలోమీట‌ర్ లేదా కిలోమీట‌ర్ మేర లింక్ రోడ్ నిర్మిస్తే ఆ ప్రాంతంలో గంట‌ల త‌ర‌బ‌డి ఉంటున్న ట్రాఫిక్ స‌మ‌స్యను అరిక‌ట్టవ‌చ్చు. లింక్ రోడ్లను నిర్మిస్తే ట్రాఫిక్ జామ్ ల‌ను అరిక‌ట్టవ‌చ్చని గ‌తంలో స‌ర్వేలు స్పష్టం చేశాయి. వీలున్న ప్రాంతాల‌లో లింక్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని వచ్చిన సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకున్న వారే క‌రువ‌య్యారు. బంజారాహిల్స్- జూబ్లీహిల్స్ ల మ‌ధ్య ట్రాఫిక్ స‌మ‌స్యను త‌గ్గించేందుకు లింక్ రోడ్ల ఏర్పాటుకు అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని ప్రారంభించేందుకు జిహెచ్ఎంసి యంత్రాంగం ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ ఐదులోని ఇందిరాన‌గ‌ర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ రెండులోని అన్నపూర్ణ స్టూడియో మీదుగా లింక్ రోడ్ నిర్మించాల‌ని గ‌త ఇర‌వై ఏళ్ళుగా స్థానికులు విజ్ఙప్తి చేస్తున్నారు. ఈ లింక్ రోడ్ గురించి స‌ర్వేచేసి ప్రతిపాద‌న‌లు రూపొందించాల‌ని గ‌త ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారుల‌ను ఆదేశించింది.

ఈ మేర‌కు రెవెన్యూ అధికారులు స్థల సేక‌ర‌ణ పూర్తిచేసి ప్రభుత్వ స్థల‌మ‌నే బోర్డుల‌ను కూడా ఏర్పాటు చేశారు. కేవ‌లం అర కిలోమీట‌ర్ కూడా ఉండ‌ని 80 అడుగుల ఈ ర‌హ‌దారి నిర్మాణానికి బల్దియా యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇదే విధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో కూడా లింక్ రోడ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నాయని స్థానికుల నుంచి కొన్ని సూచనలు వచ్చాయి. పెన్షన్ ఆఫీస్ వెనుక నుంచి రోడ్ నెంబర్ పన్నెండులోని శ్మశానవాటిక వరకూ లింక్ రోడ్ ను ఏర్పాటుచేసేందుకు అవకాశం ఉంది. ఈ రోడ్ నిర్మాణానికి కేవలం జిహెచ్ఎంసికే చెందిన పార్కు స్థలాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. అయినా ఇక్కడ లింక్ రోడ్ నిర్మాణానికి ఆసక్తి చూపించడం లేదు. హైద‌రాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ ల నివార‌ణ‌కు క‌ళ్ళెదుట మార్గాలు క‌నిపిస్తున్నా ప‌ట్టించుకోని జిహెచ్ఎంసి యంత్రాంగం భారీ మొత్తాన్ని వెచ్చించి స్కైవేలు, ఫ్లై ఓవ‌ర్లు నిర్మించడంలో విపరీతమైన ఆసక్తి చూపిస్తోంది. లింక్ రోడ్ల నిర్మాణం వ‌ల‌న జిహెచ్ఎంసికి వ‌చ్చే ఇబ్బందులేమిటో, అవి ఎప్పుడు తీర‌తాయో వేచి చూడాల్సిందే. 

e-max.it: your social media marketing partner

తెరాస ఎంపీ నివాసంలో ఐటీ సోదాలు...

హైదరాబాద్‌: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో...ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్...

వైసీపీ విజయవాడ సెంట్రల్‌ సీటు వివాదం

విజయవాడ సెంట్రల్‌ సీటు విషయం వైసీపీ పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సీటు మల్లాది విష్ణుకు దాదాపుగా ఖరారు క...

చిత్తూరులో భూకంపం...

మంగళవారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లాలో భూప్రకంపలు ఐకే రెడ్డిపల్లి గ్రామస్తులకు నిద్రలేకుండా చేశాయి. ఐరాల మండలం...

ఇస్రో చైర్మన్ శివన్ శ్రీకాళహస్తి ప్రత్యేక పూజలు

చిత్తూరు: ఇస్రో చైర్మన్ శివన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించా...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

సిటీ సివిల్ కోర్టుకు జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

సీఐ వేధింపులపై చంద్రబాబు ఆగ్రహం

చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ ఓ కేసు విషయంలో మహిళను గదికి రావాలని వేధించడంపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సీఐ...

మహిళను ట్రాప్ చేసిన సీఐ పై వేటు...

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. చిత్తూరు జిల్లా వాయల్పాడు పోలీస్‌స్టేషన్‌లో సీఐగ...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

భారత్‌ 329 పరుగులకు ఆలౌట్

ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. లోయర్...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...

రూపాయి కుదేలు...

డాలర్‌తో రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. అమెరికా కరెన్సీతో రూపాయి విలువ సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రానికి రూ:7...