ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పాల ఉత్పత్తి లాభసాటిగా మారడంతో ఆ దిశగా కొత్తవారు అడుగులు వేస్తున్నారు. కానీ ఏదైనా కారణం వల్ల పశువు చనిపోతే రైతులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారంగా పశువులకు బీమా చేసుకోవాలని పశు సంవర్ధకశాఖ అధికారులు సూచిస్తున్నారు.

ప్రభుత్వం పాడి పశువుల భీమాకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు జారీ చేశారు. గతంలో యాభైశాతం ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇరవై శాతం చెల్లిస్తే సరిపోతోంది. అయితే పాతపద్దతిలో ఒక కుటుంబంలో ఒక పశువుకు మాత్రమే బీమా సౌకర్యం ఉండేది. ఆ సంఖ్యను ప్రస్తుతం అయిదుకు పెంచారు. అనుకోకుండా పశువును విక్రయించుకోవాల్సి వస్తే కొనుగోలు చేసిన వారికి బీమాను బదలాయింపు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఒక సంవత్సరం లేదా మూడేళ్ళకు భీమా చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలోని పశువైద్యశాలల్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా పాడి పరిశ్రమ అభివృద్దిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. పాడి పశువులను నమ్ముకున్న రైతులకు భరోసాగా నిలిచేందుకు నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకోని ఘటనలో పశువులు మృత్యువాత పడితే పెంపకదారులు రోడ్డున పడకుండా పశువులకు భీమా సౌకర్యం కల్పిస్తోంది. ఇందులో 80 శాతం భీమా ప్రీమియాన్ని సర్కార్ భరిస్తోంది. ఇందులో 50 శాతం వాటా కింద కేంద్ర ప్రభుత్వం 30 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. రైతులు 20 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతోంది. దేశావలి, సంకర జాతి పాలిచ్చే అన్ని జాతుల ఆవులు, గేదెలకు ఈ పథకం వర్తిస్తోంది. పశువుకు బీమా చెల్లించిన 15 రోజుల నుంచి ఈ పథకం అమల్లోకి వస్తోంది. చూలు పశువులు, ఒక్కసారిగా ప్రసవించిన ప్రతీ ఆవు, గేదెలకు ఈ పథకం వర్తిస్తోంది. ఐదేళ్ళ వయస్సు పైబడి ఐదుసార్లు పైబడి ప్రసవించిన గేదెలకు మాత్రమే ఈ బీమా అర్హత కలిగి ఉంటాయి. మార్కెట్ ధరకు అనుగుణంగా స్థానిక పశు వైద్యాధికారి నిర్ణయించిన ధరకు వాటికి భీమా సౌకర్యం కల్పిస్తారు. భీమా చేయించిన ప్రతీ పశువుకు ట్యాగ్ వేస్తారు. అది లేనివాటికి భీమా వర్తించదు. రైతు ఆధారకార్డుకు అనుసందానంగా పశువులకు భీమా చేయిస్తుండడం విషేశం. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు, పాముకాటు, వ్యాదుల ద్వారా భీమా చేసిన పశువులు చనిపోతే పరిహారం అందుతోంది. చనిపోయిన వెంటనే పశువైద్యాదికారికి సమాచారం అందించాల్సి వస్తోంది. భీమా కంపెనీకి సైతం సమాచారం అందించి వారి పతినిదుల సమక్షంలో పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించి ప్రమాదం వల్లే పశువు మృతి చెందినట్లు నిర్ధారించిన తర్వాతే చెల్లించిన ప్రీమియం ప్రకారం భీమాను 10 నుంచి 60 వేల వరకు అందించబడుతోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి రైతుల నుండి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఈ పథకంపై రైతులకు మరింత అవగాహన కల్పించినట్లయితే ఎంతోమేలు చేకూరుతోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

 

e-max.it: your social media marketing partner

నిరాహార దీక్షకైనా రెడీ...పవన్

పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉద్దానం సమస్యపై 48గ...

నేడే కొలువుదీరనున్న కర్ణాటక ప్రభుత్వం

మొత్తానికి కుమారస్వామి మే23 బుధవారం సాయంత్రం 4:30లకి విధానసౌధలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను ముహూర్...

రమణ దీక్షితులపై సిబిఐ విచారణ

టీటీడీ ఆభరణాల మాయంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై మాజీ పురావస్తు శాఖాధికారి చెన్నారెడ్డి సంచలన

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతిచెందారు...

హైదరాబాద్ ఫుట్ పాత్ వ్యాపారంపై కేటీఆర్ ఆరా...

తెలంగాణని బంగారుమయం చేయాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలో, ఫుట్ పాత్ వ్యాపారంపై జరుగుతున్న

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

కర్ణాటకలో హంగ్ తప్పదా

కర్ణాటకలో హంగ్ తప్పదా

చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం దాదాపుగా 70 శాతం దాకా పోలింగ్ నమ...

తమిళనాడులో ప్రజా సంఘాల ఆందోళన

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని

లంచగొండిని పట్టించిన రైతు

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రెవేశపెట్టిన రైతుబంధు పథకం విషయంలో అధికారులు అవినీతులకు పాల్పడుతున్నారు. తాజాగ పెద్...

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...