మెట్రోరైలు ప్రారంభం ముహూర్తం దగ్గరపడుతుండటంతో మియాపూర్ లో నిఘా వర్గాలు, పోలీసు భద్రత ఎక్కువైంది. మియాపూర్ హెలిపాడ్ నుంచి మొదలు ప్రధాని ‌మెట్రో పైలాన్ ప్రారంభించి రిటర్న్ అయ్యేవరకూ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా వుండేందుకు తెలంగాణా పోలీసులు భద్రతపై దృష్టి పెట్టారు.

ఈనెల 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మియాపూర్‌లో పైలాన్‌ను ప్రారంభించడం ద్వారా మెట్రోరైలు ప్రారంభోత్సవం కార్యక్రమం జరగనుంది. భద్రతకు సంబంధించిన పలు విషయాలపై అక్కడి అధికారులతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. మియాపూర్ స్టేషన్‌ వద్ధ పైలాన్‌ నిర్మాణం జోరందుకుంది. HMR ఆకృతిలో తయారవుతున్న మెట్రో‌పైలాన్ ను ప్రధాని ఆవిష్కరిచనున్నారు. తరువాత మియాపూర్ స్టేషన్ లో నిర్మించిన లిఫ్ట్ ద్వారా సెకండ్ ఫ్లోర్ లో కెల్లి అక్కడ స్టేషన్ ను‌ పరిశీలించాక మూడోఫ్లోర్ లో వున్న ఫ్లాట్ ఫామ్ నుండి‌ మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ మీదుగా అమీర్ పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ వరకూకు 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. తరువాత రిటర్న్ ఇదే మార్గం‌లో వచ్చి మియాపూర్ నుంచి హైటెక్స్ లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమిట్ కు హాజరవుతారు. ప్రధాని చేతులమీదుగా సర్వీసులు‌ ప్రారంభం కానుండటంతో ఈ మార్గమ్ లో జోరుగా మెట్రోరైల్లు తిరుగనున్నాయి. మరోవైపు ముప్పై కిలోమీటర్ల మెట్రోమార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ప్రధాని ‌పర్యటన కోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు భద్రతాచర్యల్లో నిమగ్నమయ్యారు. ట్రాఫిక్‌ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోడానికి మూడు కమిషనరేట్ల పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత వ్యూహం, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ అంశాలపై ఆయా కమిషనరేట్ల అధికారులు బిజీగా వున్నారు. మియాపూర్ పరిసరాల్లో పోలీసు జాగిలాలు అణువణువునా శోదిస్థున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే 15 స్టేషన్లతో పాటు సైబరాబాద్‌ పరిధిలోకి వచ్చే 9 స్టేషన్లకు సంబంధించిన భద్రత, ట్రాఫిక్‌ చర్యలు తీసుకుంటున్నారు. మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి, తార్నాక నుంచి నాగోల్‌ వరకు సైబరాబాద్‌ పరిధిలోకి రాగా భరత్‌నగర్‌ నుంచి మెట్టుగూడ స్టేషన్ల వరకు హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోకి వస్తున్నాయి. కేవలం ప్రారంభోత్సవ వేడుకలు మాత్రమే కాకుండా మెట్రోరైలు సేవలు ప్రారంభమైన తర్వాత కూడా స్టేషన్ల భద్రత, పార్కింగ్‌ విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌ఎంఆర్‌తో పాటు నగరంలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, ఇతర శాఖల సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పోలీస్‌ యంత్రాంగాన్ని కూడా ఈనెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌కు విధి నిర్వహణ నిమిత్తం రప్పించనున్నారు. మెట్రోరైలు ప్రారంభం, గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక రాక, ఇలా కార్యక్రమాలన్నీ ఒకే రోజున ఉండడంతో పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు సీరియ్‌సగా తీసుకుని కార్యాచరణలో నిమగ్నమయ్యారు.

 

e-max.it: your social media marketing partner

నిరాహార దీక్షకైనా రెడీ...పవన్

పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉద్దానం సమస్యపై 48గ...

నేడే కొలువుదీరనున్న కర్ణాటక ప్రభుత్వం

మొత్తానికి కుమారస్వామి మే23 బుధవారం సాయంత్రం 4:30లకి విధానసౌధలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను ముహూర్...

రమణ దీక్షితులపై సిబిఐ విచారణ

టీటీడీ ఆభరణాల మాయంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై మాజీ పురావస్తు శాఖాధికారి చెన్నారెడ్డి సంచలన

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతిచెందారు...

హైదరాబాద్ ఫుట్ పాత్ వ్యాపారంపై కేటీఆర్ ఆరా...

తెలంగాణని బంగారుమయం చేయాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలో, ఫుట్ పాత్ వ్యాపారంపై జరుగుతున్న

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

కర్ణాటకలో హంగ్ తప్పదా

కర్ణాటకలో హంగ్ తప్పదా

చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం దాదాపుగా 70 శాతం దాకా పోలింగ్ నమ...

తమిళనాడులో ప్రజా సంఘాల ఆందోళన

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని

లంచగొండిని పట్టించిన రైతు

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రెవేశపెట్టిన రైతుబంధు పథకం విషయంలో అధికారులు అవినీతులకు పాల్పడుతున్నారు. తాజాగ పెద్...

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...