స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకింగ్ కోసం జీహెచ్ఎంసీ చేపడతున్న ప్రయోగాలు కొన్న్ని జనాన్ని ఆకర్షిస్తుంటే మరి కొన్ని మాత్రం వికటిస్తున్నాయి. జనం నెత్తిన అనుకోని పిడుగుల్లా మారుతున్నాయి. నగరంలో చెత్త చెదారం లేకుండా చేయాలని, ప్రధాన వీధులతో పాటు బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయడంతో పాటు అపరిశుభ్రం చేసే వారికి గాంధీగిరి పేరుతో మార్పు తీసుకురావాలని జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు కమీషనర్ జనార్ధన్ రెడ్డి బల్దియాలోని శానిటేషన్ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడా ఆదేశాలతో సర్కిళ్ల పరిధిలోని పారిశుద్య సిబ్బంది రెచ్చిపోయి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఘనత వహించిన గ్రేటర్ హైదరాబాద్ పాకల మండలి పాలనలో నగరంలోని కోటి మంది నానా తిప్పులు పడుతున్నారు. నరంలో నివిసిస్తున్న ప్రజల్లో ప్రతి రోజు కనీసం యాబైశాతం జనాభా ఏదో పనుల కోసం నగరంలో నిత్యం సంచరిస్తుంటారు. ట్రాఫిక్ వలయంలో గంటలతరబడి రోడ్లపై గడపాల్సిన పరిస్థితి. దీంతో నగర వాసులు కనీసం అత్యవసరంగా కాలకృత్యాలు తీర్చుకోలేక పోతున్నారు. బల్దియా యంత్రాంగం హైదరాబాద్ నగరంలో పలు రకాల టాయిలెట్స్ నిర్వహిస్తున్న ప్రజల అవసరాలు తీర్చిలేక విమర్శలపాలవుతున్నారు. ఇప్పటికే కట్టించిన టాయిలెట్స్ ను ప్రకటణకు కోసం కట్టించినట్టు వాటిని వ్యాపార వనరులుగా మార్చుకుని టాయిలెట్స్ పై మాత్రం చిల్లరేరుకుంటున్నారు. నగర వాసులు రోడ్ల పక్కన కాలకృత్యాలు తీర్చుకోవజడానికి సరిగ్గా టాయిలెట్స్ కూడా నిర్వహించలేక పోతున్నారు. పురుషుల సంగతిపక్కన పెడితే మహిళలు మాటల్లో వర్ణించలేని వేదన పడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో జనాబా కోటి దాటిందని ప్రభుత్వమే ఘనంగా చెప్పుకుంటోంది. కాని జనాభకు అనుగుణంగా మౌళిక వసతులు కల్పించలేక పోతోంది. నగరంలో స్వచ్చ్ భారత్ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 25 మహిళలకు ఓ టాయిలెట్ ప్రతి యాబై మంది పురుషులకు ఓ టాయిలెట్స్ స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది భారత సర్కార్. కాని హైదరాబాద్ లో బల్దియా నిర్వహించే మొత్తం టాయిలెట్లు అన్నీ కలిపిన ఐధు వందలు దాటడం లేదంటే పరిస్థితి ఏంత భయానకంగా ఉందో ఊహించుకోవచ్చూ. నగంరలో పారిశుద్యం సరిగ్గా ఉండాలని బహిరంగ మలమూత్రాలు చేయోద్దని చెప్పే బల్దియా ఐధు రకాల టాయిలెట్స్ నిర్వహిస్తోంది. ఇందలో కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగింటి చేతులు దులుపుకుంది.
నగరంలో బీవోటీ ప్రాతిపధికనా నిర్మించినా టాయిలెట్స్ 129, ఈ మద్యనే 5 లక్షలతో కొనుగోలు చేసినా ఫ్రీ ప్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ ఓ 200 కొన్నారు. అవి కూడా ఇంకా ఉపయోగంలోకి రాలేదు. అలాగే ఇంజనీరింగ్ టాయిలెట్స్ మరో 57 ఉన్నాయి. వీటిని ప్రతి నెల సఫాయి కర్మచారీలకు 6 వేల వేతనం చెల్లిస్తున్నారు. సులబ్ టాయిలెట్స్ ఇంకా 50 ఉన్నాయి. వీటిని 30 సంవత్సరాలు అగ్రిమెంట్ తో వారే నిర్వహిస్తారు. అలాగే బాయె టాయిలెట్స్ 50 నిర్మించారు. వీటిని నిర్వహణ కోసం ఐదు మిషన్లు కొన్నారు అవి కూడా సరైన నిర్వహణలేక మూలన పడ్డాయి.
ప్రతి రోజూ హైదరాబాద్ కు వేలాది మంది వివిధ పనుల మీద వస్తుంటారు, వారితో పాటు పర్యాటకుల సంఖ్య కూడా 10 వేలకు పైగా నే వుంది. ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో కాలకృత్యాలు తీర్చుకోవాడానికి ముఖ్య ప్రాంతాలైనా బస్టాండ్స్, చార్మినార్, గోల్కొండ, లుంబీనీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ టాంటి చోట్ల కూడా టాయిలెట్స్ లేని దుస్థితి నెలకొంది. కనీసవసరాలను తీర్చాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు తాము ఇవ్వాల్సిన సదుపాయలాలను పక్కన పెట్టి గాంధీగిరి పేరుతో ఇలా ఓవర్ యాక్షన్ చేయడంపై విమర్శొలొస్తున్నాయి. ఇదే జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మూత్రం పోస్తూ కరెంట్ షాకుతో ఓ యువకుడు మృతి చెందడంపై ఇంత వరకూ జిహెచ్ఎంసి ఎలాంటి సమాధానం కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా రోడ్లపై అత్యవసర పరిస్తితుల్లో మూత్రం పోసుకుంటున్న వారిపై దాడి చేసి ఫైన్ కట్టమని డిమాండ్ చేస్తున్నారు జీహెచ్ంసీ అధికారులు.
నగరంలో నిర్మిస్తున్న టాయిలెట్స్ వ్యాపార ప్రకటణలకే పరిమితమవుతన్నాయి. నగరంలో ముఖ్య ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించలేక పోతున్నారు నగర పౌరులు. చూడటానికి మాత్రమే పరిమితం అయిన ఫ్రీ ప్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ ను ఇప్పటికైనా అందుబాటులోనికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.