నల్గొండజిల్లా కొండమల్లేపల్లి మండలం బుడ్డోని తండాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో కట్టుకున్న భార్యని రోకలి బండతో కొట్టి చంపాడు ఓ కసాయి భర్త.

కొండమల్లేపల్లి మండలం బుడ్డోని తందాకు చెందిన రమేష్, సరిత దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 7, 4వయస్సు గల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి కాయకష్టం చేసుకుంటూ బ్రతికే నిరుపేద గిరిజ కుటుంబం వారిది. అలాంటి కుటుంబంలో కుంపటి రాజేసింది మద్యం. భర్త రమేశ్ ఒక రెస్టారెంట్లో వంట మాస్టర్ గా పనిచేస్తుండగా, భార్య సరిత మరో హోటల్లో పాచి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా రమేష్ తాగుడుకు బానిస అయ్యి పనిచేయక పోగా తరచూ డబ్బుల కోసం భార్య సరితను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే  తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని కూడా అమ్మేసాడు. ఈ మధ్య రమేష్ తాగుడుకు బానిస కావడంతో తాను పనిచేసే రెస్టారెంట్ లోంచి తీసేశాడు తన ఓనర్. ఉన్న పని కూడా పోవడంతో జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. రోజు పనిచేసే భార్య సరితను నిత్యం డబ్బులకోసం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే రాత్రి బాగా తాగి వచ్చిన రమేష్, భార్య సరిత తలపై రోకలి బండతో కొట్టి పరారయ్యాడు. బలంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెల్లింది. ఏమి జరిగిందో తెలియని వారి పిల్లలు తన తల్లి రక్తపు మడుగులో ఉండడాన్ని చూసి ఏడవసాగారు. పిల్లలు ఏడుస్తుండడాన్ని గమనించిన చుట్టు పక్కవాళ్ళు వచ్చి సరితను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగ ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండావాసుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాగుడుకు బానిస అయ్యి క్షణికావేశంలో చేసిన తప్పుకు తల్లిదండ్రులు దూరమైన అభం శుభం తెలియని ఆ చిన్నారులు పడుతున్న వేదన వర్ణనాతీతం.

 

e-max.it: your social media marketing partner

గవర్నర్ నరసింహన్ ఢిల్లీ ట్విస్ట్, హైదరాబాద్ కి యూ టర్న్

ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అవడానికి వెళ్లిన ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన పర్యటనను అర్ధాంతరంగా ముగ...

రోడ్డున పడ్డ ముద్దు వ్యవహారం, సీన్ లోకి వచ్చిన చంద్రబాబు

దివంగత టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగింది, నిన్న మొన్నటి వరకు కేవలం...

భారత తూర్పు తీరంలో ఇన్ కాయిస్ హెచ్చరికలు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రచండమైన గాలుల కారణంగా భారత తూర్పు తీరంలోని సముద్రంలో భారీ అలలు ఎగసిపడే ప్రమా...

సిఆర్ డీఏ కమీషనర్ తో రాజధాని నగరం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు

అమరావతి లో సీ ఆర్ డీ ఏ పరిధిలో పనులు సజావుగా జరుగుతున్నయా లేదా అని అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించా...

పటాన్ చెరులో భారీ అగ్నిప్రమాదం...

సంగారెడ్డి పటాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగర్వాల్ రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగుతున్నాయి. ప...

మీడియా తో ముచ్చటించిన పొన్నాల లక్ష్మయ్య 

ప్రస్తుత రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం హెచ్చరిక

ఈ నెల 29కల్లా దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సముద్ర పరిసరాల్లో...

అమెరికాతో సత్సంబంధాలను కోరుకుంటునాము: ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఇకపై ఎటువంటి అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని, ఖండాంతర క్షిపణి పరీక్షలనూ నిలిపివేస్తున్నామని, అటామిక్ టెస్ట...

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ శాఖ షాక్

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన కర్ణాటక మంత...

వెంకయ్య నిర్ణయానికి స్పందించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య నాయుడికి లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

యాదాద్రిలో దారుణం... దళిత యువతిపై అత్యాచారయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు...

బాలానగర్ లో అగ్ని ప్రమాదం... మంటల్లో కాలిపోయిన యువతి

ఓ యువతి ప్రమాదవుశాత్తు మంటల్లో చిక్కుకొని కాలిపోయిన సంఘటన బాలానగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. మూసాపేటకు చ...

'ఎన్టీఆర్' బ‌యోపిక్ దర్శకుడి సంచలన నిర్ణయం!

'ఎన్టీఆర్' బ‌యోపిక్ దర్శకుడి సంచలన నిర్ణయం!

స్వర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత కథను అభిమానుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు తేజ దర్శకత్వంలో బాలకృష్ణ...

'సైరా'లో వీరనారిగా కనిపించనున్న తమన్నా!

'సైరా'లో వీరనారిగా కనిపించనున్న తమన్నా!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సైరా' సినిమా షూటింగ...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...