టీఆర్ఎస్ సభకు వచ్చే రైతులందరూ నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలపాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ కు సభ నిర్వహించే నైతిక హాక్కు లేదని రేవూరి అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందనుకుంటే 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారిందన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ గార్డెన్‌లో రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గార్డెన్‌లో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన వ్యక్తిని ఉదయం వాకింగ్‌కు వచ్చిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు మైలార్ దేవ్ పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహిపాల్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే మృతుడు మరణించిన తీరు చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరెవరైనా హత్య చేశారా? అన్న కోణంలో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మిషన్ భగీరథను మరోసారి జాతీయ అవార్డు వరించింది. మౌలిక వసతుల కల్పనలో మిషన్ భగీరథ వినూత్నమైన పథకమని ప్రశంసించిన హడ్కో, రెండో సారి అవార్డు ప్రకటించింది. తెలంగాణలోని కోట్లాది మంది ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించాలన్న శుభసంకల్పంతో సాగుతున్న మిషన్ భగీరథలో భాగం కావడాన్ని గర్వంగా భావిస్తున్నామంది హడ్కో. ఈ నెల 25న జరిగే హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి  వెంకయ్యనాయుడు ఈ అవార్డును ప్రధానం చేస్తారని హడ్కో తెలిపింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు పంచాయితీ కొత్త పూసపల్లి గ్రామస్థులు నీటికోసం రెండు కి.మీ. దూరంలో ఎక్కడో అడవిలో వున్న బావి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి బిందెలతో నీరు మోసుకొని రావలసిన పరిస్థితి. ఊర్లో వున్న బావులు, బోర్లు ఎండిపోవడంతో పాటు, సింగరేణి సంస్థ నుండి పైపులైన్ ద్వారా వచ్చే నీళ్ళు కూడా వారానికి ఒకసారి వస్తుండటంతో ఊరిలో వున్న వాటర్ టాంక్ లు ఎప్పుడూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.

పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగుస్తున్న ఓపీఎస్ వర్గం

పార్టీపై, ప్రభుత్వంపై తమపట్టే కొనసాగాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపడుతుండడంతో పళనిస్వామి కాస్త తగ్గినట్టు కని...

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రె...

అమరావతి సచివాలయంలో సీఎం టెలీ కాన్ఫరెన్స్

అమరావతి సచివాలయంలోని తన చాంబర్ లో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు-ప్రగతి ఉద్యమాన్ని సవాల్ గ...

భానుడి భగభగలు... థియేటర్ల యాజమాన్యాలకు కనకవర్షం

మండే ఎండల పుణ్యమా అని బెజవాడలోని సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. సినిమా ఏమిటనేది చూడకుండా...

నగర శివారులో గంజాయి ముఠా అరెస్ట్

నగర శివారులో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

రెవిన్యూ అధికారులు కబ్జాలకు సహకరిస్తున్నారని టిడిపి నేతల ఆందోళన

అధికార పార్టీ నేతల ఒత్తిడిలకు తలొగ్గి మహబూబ్ నగర్ రెవిన్యూ అధికారులు కబ్జాలకు సహకరిస్తున్నారని టిడిపి నేతలు తహ...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

అమెరికాతో కయ్యానికి సై అంటున్న 'కిమ్ జాంగ్ ఉన్'

ప్రపంచ పెద్దన్నయ్యతో కయ్యానికి సై అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అస్త్ర-శస్త్రాలతో అమెరికాపై దాడికి త...

ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల మెరుపుదాడి...24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

మావోయిస్టులు విరుచుకుపడటంతో 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్ల పరిస్థితి విషమంగా మారిం...

ఉత్తరాఖండ్‌లో ప్రారంభమయిన 'వర్చువల్‌' పోలీస్‌ స్టేషన్‌

ఉత్తరాఖండ్‌లో వర్చువల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదును స్వీకరించే వర్చువల్‌ పోలీస్...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసార...

బేగంపేట్ లో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న నలుగురు అరెస్ట్

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర...

బుల్లి తెరపై సందడి చేయనున్న 'కమల్ హాసన్'

కమల్ హాసన్ ఇక బుల్లి తెరపై సందడి చేయనున్నారు. బిగ్ బాస్ తమిళ వర్షన్ కు స్టార్ హీరో కమల్ యాంకరింగ్ చేయనున్నారు....

ఏపీలో బాహుబలి-2 కోసం ప్రత్యేక షోలు

ఏపీలో బాహుబలి-2 కోసం ప్రత్యేక షోలు

బాహుబలి-2 ఈ నెల 28న విడుదల కానుంది. తెలుగు సినిమా పవర్ ని ప్రపంచం మొత్తానికి చెప్పింది బాహుబలి-1 చిత్రం. బాహుబ...

'క్లాస్ ఇన్నింగ్స్'ను కంటిన్యూ చేస్తున్న 'హషీమ్ ఆమ్లా'

మొన్న ముంబైపై సెంచరీతో చెలరేగి తనను విమర్శించిన వారు సిగ్గుపడేలా చేశాడు ఆమ్లా..! అడ్డ దిడ్డమైన షాట్లతోనే కాకుం...

ఒక్క ఇన్నింగ్సుతో విమర్శకులకు సమాధానం చెప్పిన 'ధోనీ'

ఎన్నాళ్లైంది ధోని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ చూసి. జట్టులో ఉన్నాడన్న మాటే కానీ అతను గతంలో మాదిరి ధనాధన్‌ ఆటను ప...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...

ఈ ఏడాది అన్ని రంగాలలోనూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్స్

ఆర్ధిక సంవత్సరం ఆఖరున ఆఫర్స్ రావడం సహజం. అయితే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దాదాపు అన్ని రంగాలలోనూ బంపర్ ఆఫర్స్ అ...