వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌ తడిసి ముద్దవుతోంది. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన మార్గాల్లో రహదారుల పైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వ్యవసాయానికి 24గంటల కరెంట్ పథకంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా మొదట ఉమ్మడి మెదక్ జిల్లాలో 24గంటలు కరెంట్ సరఫరా చేయనున్నారు. ఇందుకుగాను ఉమ్మడి జిల్లా పరిధిలోని సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలను ఎంపికచేసి అమలు చేస్తున్నారు. దీంతో వ్యవసాయానికి 24గంటల కరెంట్ సరఫరా చేయడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు విద్యుత్ కోతలతో అష్టకష్టాలు పడ్డ విషయం తెలిసిందే.

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్‌లో రెండేళ్ల కుమారుడిని తల్లి బావిలో తోసి, తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలు బావిలో నీటిపై తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతులను లత, లక్కీగా పోలీసులు గుర్తించారు. 

 

 

 

ప్రేమించిన ప్రియురాలు రవళి కొంతకాలంగా తనతో సన్నిహితంగా ఉండడంలేదని ప్రియుడు మల్లెష్ దాడిచేసి కిడ్నాప్ కు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తాళ్ళపూసలపల్లి గ్రామంలో జరిగింది. రవళి తనతో సన్నిహితంగా ఉండడంలేదని, మరోకరితో చనువుగా ఉంటుందని స్నేహితుల సహాయంతో రవళిని గాయపరిచి కిడ్నాప్ కు ప్రయత్నించాడు. గాయపడిన రవళి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

ప్రధాని విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు

ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంస...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

విశాఖలో ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ల ఆందోళన

విశాఖలో ఆర్టీసీలో పనిచేస్తున్న హైర్ బస్ డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్.ఎమ్ ఆఫీస్ వద్ద పెద్దఎత్తున ఆం...

కడప జిల్లాలో రోడ్డుప్రమాదం..ఇద్దరి మృతి

కడప జిల్లా బద్వేల్ కృష్ణపట్నం ఎన్.హెచ్.జీ జాతీయ రహదారిలోని హరితహోటల్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద...

మంచిర్యాల జిల్లాలో బొగ్గుగనులపై ఏఐటీయూసీ నాయకుల ధర్నాలు

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులపై ఏఐటీయూసీ నాయకులు ధర్నాలు చేపట్టారు. సింగరేణి కార్మికుల న్యాయ...

డ‌బుల్ బెడ్ రూమ్స్ పేద‌ల కోస‌మే...

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ‌లోని అర్హులైన పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తున్నామ‌న్న...

ఇస్లామిక్‌ స్టేట్‌లో జర్మనీ యువతి ఆవేదన

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరిన ఓ జర్మనీకి చెందిన యువతి తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్...

అమెరికాలో తెలుగు దంపతులు మృతి

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో గత శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియానాకు చెందిన తెలుగు దంపతులు ప్రయాణిస్...

మళ్లీ వేడెక్కిన బీహార్‌ రాజకీయాలు

బీహార్‌ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అనూహ్య పరిణామాల మధ్య బీహార్ సీఎంగా నితీశ్ తిరిగి ప్రమాణస్వీకారం చేయనున్నార...

ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి చంద్రబాబు కేంద్రమంత్ర...

తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్

తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్ కు గురైంది. శ్రీకాళహస్తి అమ్మపాలెంకు చెందిన బండి సురేష్ దంపతుల కూతురైన 7 ఏళ్ల న...

డ్రగ్స్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన ఛార్మీ

డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. సిట్ అధికారుల విచారణా తీరు సరిగ...

హీరో సూర్యతో నటించాలనుకుంటున్న సాయిపల్లవి

హీరో సూర్యతో నటించాలనుకుంటున్న సాయిపల్లవి

కాలేజ్ డేస్ లో తాను ఎక్కువగా హీరో సూర్యను అభిమానించేదానినని తెలిపింది 'ఫిదా' కథానాయిక సాయిపల్లవి. ఆయన సినిమాలన...

'పైసా వసూల్' తో అభిమానుల ముందుకు రానున్న బాలయ్య

'పైసా వసూల్' తో అభిమానుల ముందుకు రానున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ 101వ సినిమా అభిమానుల ముందుకు రానుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...