TRS completed its four years rule

బంగారు తెలంగాణ అంటూ ప్రజ‌ల్లో కొత్త ఆశ‌లు రేకెత్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొద‌టి రెండేళ్లు త‌డ‌బాటు ప‌డినప్పటికి మూడో ఏడాది నుంచి

KCR rythu bhima scheme

రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రైతు కళ్లలో ఆనందం చూడటమే తన కర్తవ్య మంటున్న ముఖ్యమంత్రి కేసిఆర్ , రైతుబీమా పథకానికి ఎంత డబ్బు అవసరమైనా ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ప్రముఖ జీవిత బీమా సంస్ద ఎల్ఐసితో భారీ ఒప్పందం జరిగింది. మరి వివరాలేంటి..?

 

రైతు జీవిత బీమా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం.. ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు, ఎల్‌ఐసీ ప్రతినిధులు హాజరయ్యారు.ఎల్ఐసి అధికారులు... ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

 

పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రైతులకు మంచి కార్యక్రమాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి కేసిఆర్  పేర్కొన్నారు. ఆగస్టు 15లోపు రైతులతో భీమా పత్రాల్లో వివరాలు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంతో 89శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నట్లు జాతీయ పత్రిక ప్రచురించిన విషయాన్ని కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణలో రైతుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని నేను తెలంగాణ రైతుని అని సగర్వంగా చెప్పుకునే స్థితికి అన్నదాతలు చేరాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

రైతుకు జీవిత బీమా కోసం ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన గొప్ప పని అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. 

 

రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుపై సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతుందని సీఎం చెప్పారు. రైతుబీమా పథకానికి ఎంత డబ్బు అవసరమైనా ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా రూ. 5 వేల కోట్లు రైతులకు అందాయని తెలిపారు . 

దేశానికి అన్నం పెట్టే రైతుకు సమస్యలు ఉండకూడదు అనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. అందరికీ అన్నం పెట్టే రైతు క్షేమంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. . రైతులు అందరూ సంఘటితమవ్వాలి. సంఘటితమవడంలో ఉన్న శక్తి రైతులకు తెలియాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైతులు మంచి రైతులుగా.. తెలివైన రైతులుగా మారాలని కోరుకుంటున్నానని సీఎం తెలిపారు.

 

మనం తెలివిగా వ్యవసాయం చేయాలి. పంటల సాగుపై రైతులకు ఏఈవోలు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పండించిన ప్రతి పంటకు మంచి రాబడి వచ్చేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. పంటల కాలనీలను రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు ఉన్నాయో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఎకరంలో.. ఏ గుంతలో ఏ పంట ఉందో మనకు తెలియాలి. ఫలితంగా రాష్ట్రంలో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందో మనకు తెలుస్తుందని సీఎం పేర్కొన్నారు. రైతుబంధు పథకంతో రాష్ట్రంలో కొన్ని పార్టీలు దివాళా తీశాయన్నారు

అటు ఎల్ ఐసి అధికారులు కూడా ఈ పధకాన్ని ఆకాశానికి ఎత్తేశారు. దేశ చరిత్రలోనే ఇదో సువర్ణాధ్యాయంగా ప్రశంసించారు.. తెలంగాణ ప్రభుత్వం రైతుకు రూపాయి ఖర్చు లేకుండా జీవిత బీమా కల్పించడాన్ని , అది ఇంత పెద్ద ఒప్పందం చేసుకొవడం తమ సంస్దకు లభించిన గొప్ప అవకాశంగా అభివర్ణించారు.

 

తెలంగాణ నాలుగేండ్ల ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్, రైతుబంధు పధకం తరువాత ప్రతిష్టాత్మకమైన రైతు భీమా పధకాన్ని ప్రవేశ పెట్టడం తో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ రైతాంగం తమ సమస్యలు తీర్చే దేవుడిలా ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చారని భావిస్తుంటే, సరిహద్దు రాష్ర్టాల అన్నదాతలు సైతం తమ ప్రభుత్వాలూ తెలంగాణ పధకాలను అనుసరిస్తే బాగుంటుందని ప్రార్దిస్తున్నారు. మహారాష్ర్టకు చెందిన ఏకంగా 40 సరిహద్దు గ్రామాల ప్రజలు తమని తెలంగాణ లో కలపాలని అక్కడి ప్రభుత్వాన్ని, తమను కలుపుకోవాలని ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం కేసిఆర్ పధకాల తీరును చెప్పకనే చెబుతోంది.రైతాంగం మాత్రం  తమ కష్టాలు తీరతాయని ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు.

Telangana rythu bhima

దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి రైతు బాంధవుడిలా అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత భీమాతో కొత్త పధకం

రైతు బంధు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఆయన దీని విధి విధానాలను వివరించారు.

కడపకు ఉక్కు రాదు తుక్కు రాదు - టీడీపీ నేత

కడప: సీఎం రమేష్ ఉక్కు దీక్షపై వైసీపీ ఎమ్మల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులనుంచి దీక్ష చేస్తున...

తెరాసలో వర్గ పోరు

జనగామ జిల్లాలో టీఆర్ఎస్ నేతల వర్గపోరు బయటపడింది. చిలుపూర్ మండల కేంద్రంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ నేతల మధ్య...

ఈతకెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు

కృష్ణ: ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ విషాదానికి వేదికైంది. కృష్ణ నదిలో ఈతకానీ వెళ్లిన నలుగురు యువకులు అందులో గల్లంతయ్...

చంద్రబాబుకు ఘన స్వాగతం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖలోని మధురవాడలో అమృత వ్యాలీ...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

రైల్వేగేటును ఢీ కొన్న టిప్పర్

శ్రీకాకుళం: వేగంగా వస్తోన్న టిప్పర్ కోటబొమ్మాళి-నౌపాడ మధ్య కాకరపల్లి రైల్వేగేటును ఢీ కొంది. ఈ ఘటనలో రైల్వే గేట...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...